సత్యము యొక్క వెలుగులో – గ్రాలుసందేశమును సంపుటము III (ఈబుక్)
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క మూడు సంపుటాలలో మొత్తం 168 ఉపన్యాసాలు ఉన్నాయి. అవి వాటి వరుసక్రమంలో విషయాన్ని క్రమంగా విస్తరిస్తూ సమస్త సృష్టి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి.
ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు 1923 నుండి 1938 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినా, నేటివరకు అవి తమ అర్థాన్ని కోల్పోలేదు. అవి సృష్టి శాసనాల ఆధారంగా ఒక సమగ్రమైన విశ్వవివరణను అందిస్తాయి. ఆ వివరణ పాఠకునికి, జీవితంలోని మర్మమైయున్న అవినాభావ సంబంధాలను గుర్తించునట్లు చేస్తుంది మరియు తద్వారా విలువైన జీవితసహాయాలను అందిస్తుంది.
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం ముఖ్యంగా ఎందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం
పొందిందంటే, అది మానవాళి యొక్క గొప్ప ప్రశ్నలకు నిస్సంశయమైన సమాధానాలను అందిస్తుంది, ఉదాహరణకు జీవితం యొక్క ఉద్దేశం గురించి, ప్రారబ్ధంలో న్యాయత గురించి లేక మరణం తరువాత జీవితం గురించి, ఇత్యాది. ఇంతవరకు అది 20 భాషలలోనికి అనువదించబడింది మరియు 90 దేశాలలో పొందబడగలదు.
పాఠకునికి నిజమైన జీవితాన్ని చేరువగా తెచ్చుట, అతని వ్యక్తిత్వ అభివృద్ధికి విలువైన ప్రేరణలను ఇచ్చుట మరియు అతన్ని దేవునిగుర్తింపును తనలో కలిగియున్న గుర్తింపుమార్గంపై నడిపించుట రచయిత యొక్క ఒక ఉద్దేశమైయుండింది. „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు ఆ ప్రక్రియలో ఒక „దీపము మరియు దండమువలే“ ఉపయోగపడవలెను, మతపరమైన ఆలోచనతో లేక మనిషి యొక్క మతంతో సంబంధంలేకుండా. అబ్ద్-రు-షిన్ ఒక మతాన్ని కాని ఒక తెగను కాని లేక మతసంఘాన్ని కాని స్థాపించగోరలేదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలోని వివరణలు సరలమైన, అర్థమయ్యే, సృష్టి శాసనాలను తమ ఆధారంగా కలిగియున్నాయి. అవి బాహ్యలోకంలో, అదే విధంగా జీవాత్మ యొక్క అంతరంగిక జీవితంలో పనిచేస్తాయి. ఆ వివరణలు విలక్షణమైన మానవ అనుభవాలను సంభోదిస్తాయి, బలాలను మరియు బలహీనతలను చూపుతాయి మరియు మర్మంగావున్న లోటుపాట్లను, అంతేకాక అనుదినజీవితం ఆత్మీయ అభివృద్ధి కొరకు అందించే చాలా అవకాశాలను సూచిస్తాయి. పాఠకుడు దానితో, ఆ ఉపన్యాసాలలోని విషయాన్ని తన స్వంత జీవితంలో తిరిగి కనుగొనుటకు మరియు దానిని సత్యమైనదానిగా గుర్తించుటకు అవకాశాన్ని కలిగియుంటాడు. ఆ విధంగా, ఆత్మీయమైన, అంతఃకరణానుభూతులతోకూడిన అనుభవాలు, వస్తుగత-తార్కిక నిగమనములతోపాటు ఒక సమగ్రమైన, పూర్ణరూపాత్మకమైన లోకచిత్రంగా ఏర్పడగలవు. దానిలో విజ్ఞానశాస్త్ర సంబంధమైన మరియు మతసంబంధమైన సత్యాన్వేషణకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథము ఖచ్చితంగా సర్వసాధారణం కాని „గ్రాలుసందేశము“ అనే ఉపశీర్షికను కలిగియిన్నది. „గ్రాలు“ అనే పదంతో మనుష్యులు నేడు తరచుగా పురాణ కథల ద్వారా, ఐతిహ్యముల ద్వారా మరి ముఖ్యంగా కళ యొక్క రచనల ద్వారా సంక్రమించిన కాంక్ష-చిత్రాలు మరియు దర్శనములతో జోడిస్తారు. ఈ సంక్రమణలు వాస్తవంగా ఉనికిలోవున్న దానిని ధృవీకరిస్తాయని అబ్ద్-రు-షిన్ వివరిస్తాడు. అది, సమస్త సృష్టి ఉనికిలో కొనసాగుటకు మరియు దాని నిర్వహణకు అత్యంత ప్రధానమైనది. అదే సమయంలో „సందేశము“ అనే పదము, ఉపన్యాసాల ద్వారా బోధించబడే జ్ఞానం యొక్క ప్రత్యేకమైన, ఉన్నతమైన మూలాన్ని సూచిస్తుంది.
నిజానికి „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథం చూపే మార్గం సంపూర్ణంగా సులువైనది. దానికి గుప్తమైన దానితో కాని లేక అటువంటి దాని గుప్తవైఖరితో కాని ఎటువంటి సంబంధం లేదు. అయితే అది, అసలైన క్రీస్తు బోధవలే గణనీయమైన అవశ్యాభ్యర్థనలను పాఠకుని ఎదుట ఉంచుతుంది. కాగా కేవలం స్వంత, నిశ్పక్షపాతమైన, వస్తుగతమైన ఆలోచనాసరళియే కాక అతి ముఖ్యంగా „మంచి కొరకు దృఢమైన సంకల్పం“ ప్రోత్సాహించ బడవలెను. తన స్వంత విషయంలో మరియు తన పొరుగువాని సేవలో మనిషి చేసే ఈ కృషి అతన్ని ఆత్మీయ అభివృద్ధికి నడిపించగలదు.
గ్రాలుసందేశము సవివరమైన సమాధానాలు అందించే ముఖ్యమైన చాలా విషయాలలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి:
• బాధ్యత మరియు ప్రారబ్ధము/కర్మ
• మరణము మరియు పునరావృతమయ్యే భూలోక జీవితాలు/పునర్జన్మ
• ఆదిపాపము మరియు వారసత్వ పాపము
• ఈవలి- మరియు ఆవలిలోకాల సంయుక్త దర్శనము
• దేవుని ప్రేమ మరియు కృప
• శరీరము, జీవాత్మ మరియు ఆత్మ
• దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు
40. క్రిష్టమస్
శుద్ధరాత్రి! దైవకుమారుడైన యేసు బెత్లెహేములోని పశువుల పాకలో జన్మించినప్పుడు, ఉత్సాహపూరిత కృతజ్ఞతలో, ఆనందోత్సాహాలతో కూడిన గానం ఒకనాడు, సృష్టి యొక్క సమస్త తలముల ద్వారా ప్రవహించింది! మరియు ఆ గ్రహింపశక్యంకాని సంఘటనను గురించి సాక్ష్యమిచ్చుట ద్వారా, దానిని మనుష్యుల దృష్టికి తెచ్చుటకొరకు, పొలాలలోవున్న గొర్రెలకాపరుల కళ్లపైనుండి, ఈ విశ్వం యొక్క సంతోషభరితమైన కంపనలో, కట్టు తొలగించబడి యుండినందున, వారు భయంలో మోకాళ్లపై పడ్డారు, ఎందుకంటే వారు, వారికి క్రొత్తదైయుండిన ఆ గ్రహింపశక్యం కాని దాని ద్వారా సంభ్రమాశ్చర్యాలలో మునిగియుండినారు.
తాత్కాలికంగా ఆ ఉద్దేశంకొరకు దివ్యదృష్టిని మరియు దివ్యశ్రవణమును సహితం పొందునట్లు చేయబడిన ఆ గొర్రెలకాపరుల విషయంలో అది భయమై యుండింది. ఆ సంఘటన యొక్క గొప్పతనాన్ని గురించిన మరియు ఆ ప్రక్రియలో తనను కనబరచుకొన్న దేవుని సర్వశక్తియెదుట వారికి కలిగిన భయము! ఈ కారణంవల్ల వెలుగు ఉన్నతములలోనుండి వచ్చిన దూత వారిని శాంతపరుస్తూ మొదట “భయపడకుడి!” అని పలికాడు.
ఎప్పుడైనా ఒక వెలుగు ఉన్నతములలోనుండి వచ్చే దూత మనుష్యులతో మాట్లాడినట్లయితే, అవే మాటలను మీరు పదే పదే కనుగొంటారు. కాగా ఉన్నతమైన దూతలను చూసినప్పుడు మరియు వినినప్పుడు భూలోకమనుష్యులు ఎల్లప్పుడు పొందే మొదటి అంతఃకరణానుభూతి భయమైయుంటుంది. శక్తి యొక్క ఓత్తిడి ద్వారా అది ఉత్పన్నమవుతుంది. దానికి వారు అటువంటి క్షణాలలో కొంతవరకు తెరువబడి సహితం ఉంటారు. కాని కేవలం అత్యంత స్వల్పంగా మాత్రమే, కాగా అంతకంటే ఎక్కువ వారిని తప్పక అణచివేయవలసి యుంటుంది మరియు కాల్చివేయవలసి యుంటుంది.
మరియు నిజానికి అది సంతోషమై ఉండవలెను కాని భయం కాదు, మనుష్యాత్మ వెలుగు ఉన్నతముల కొరకు కృషిచేసిన వెంటనే.
ఆ శుద్ధరాత్రిలో సమస్త మానవాళికి అది ప్రత్యక్షపరచబడలేదు! స్థూలపదార్థతలో తనను భౌతికంగా కనబరచుకొన్న నక్షత్రాన్ని తప్ప భూలోకమనుష్యులలో ఎవ్వరూ కూడా ఆ వెలుగు దూతను మరియు ఆయనచుట్టూ ఉండిన వెలుగు గుంపులను చూడలేదు. దానికొరకు ఎన్నుకొనబడిన కొద్దిమంది గొర్రెలకాపరులు తప్ప ఎవ్వరూ దానిని చూడలేదు మరియు వినలేదు. వారి సాధారణతలో మరియు ప్రకృతితో వారి సమీప సంబంధం కారణంగా వారు దానికొరకు అత్యంత సులువుగా తెరువబడగలిగారు.
మరియు అటువంటి గొప్ప ప్రకటనలు భూమిపై, దానికొరకు ఎన్నుకొనబడిన కొద్దిమంది ద్వారా తప్ప ఎప్పటికీ వేరుగా సంభవించలేవు! దానిని ఎప్పటికీ గుర్తుంచుకోండి, కాగా సృష్టిలోని శాసనబద్ధత మీకొరకు రద్దుచేయబడలేదు. అందువల్ల, అటువంటి అనేక సంఘటనల విషయంలో ఎటువంటి ఊహాకల్పన చిత్రాలను రూపొందించుకోకండి. అవి ఎప్పటికీ మీరు ఊహించుకొన్నట్లు ఉండలేవు! అవి బయటకు చెప్పబడని మౌనమైన అపేక్షలైయుంటాయి, అవి ఎప్పటికీ వాస్తవమైన నిర్ధారణలలోనుండి ఉత్పన్నం కావు, కాని అవి గోప్యమైన అపనమ్మకం యొక్క మరియు నా సందేశం యొక్క వాక్యాన్ని, అది మనుష్యాత్మలో సజీవం కాగల్గుటకు, ఆ వాక్యం ఏ విధంగా అపేక్షిస్తుందో ఆ విధంగా గ్రహించియుండని, ఆత్మీయ సోమరితనం యొక్క చిహ్నాలైయుంటాయి.
ఆనాడు మనుష్యులు ఆ గొర్రెలకాపరులను కనీసం కొంతకాలం వరకైనా నమ్మారు. నేడైతే అటువంటి మనుష్యులు, కేవలం అపహసించ బడతారు, విపరీత బుద్ధిగలవారిగా లేక ఏకంగా, తద్వారా భౌతిక లాభాలను పొందగోరే వంచకులుగా పరిగణించబడతారు. ఎందుకంటే మానవాళి, వెలుగు ఉన్నతములలోనుండి పిలుపులను, ప్రత్యేకంగా స్వయంగా తానే వాటిని వినలేనప్పుడు మరియు తానే స్వయంగా చూడలేనప్పుడు, వాటిని యథార్థమైనవిగా పరిగణించుటకొరకు, చాలా లోతునకు దిగజారిపోయింది.
మనుష్యులారా, మీ ఈ లోతైన పతనం కారణంగా దేవుడు, సృష్టిలోని సంపూర్ణమైన శాసనాలను, కేవలం మిమ్ములను సేవించుటకు, మీ తప్పులను స్వయంగా సరిదిద్దుటకు, మీ ఆత్మీయసోమరితనం ద్వారా ఏర్పడిన లోటును పూడ్చుటకు, త్రోసివేస్తాడని మీరు నమ్ముతారా? సృష్టిలోని ఆయన శాసనాల సంపూర్ణత భంగపరచబడలేనిది, మార్చబడలేనిది అయ్యున్నది మరియు ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది, కాగా అవి దేవుని యొక్క పరిశుద్ధ చిత్తాన్ని తమలో కలిగియున్నవి!
అందువల్ల, మీరు ఎదురుచూసే గొప్ప ప్రకటనలు కూడా భూమిపై, మీరు ఎప్పటినుండో ఎరిగియున్న రూపంలోనే తప్ప ఎప్పటికీ వేరుగా నెరవేరలేవు. మరియు ఆ ప్రకటనలను మీరు, అవి ఎంతో పూర్వం సంభవించినవై ఉన్నంతవరకు, వాటిని గుర్తిస్తారు కూడా.
మంచి క్రైస్తవుడని పిలువబడేవాడు, దైవకుమారుడైన యేసు జన్మను గురించి గొర్రెలకాపరులకు చేయబడిన ప్రకటన, కేవలం ఒక అద్భుత కథ అని ఏ మనిషైతే నొక్కి చెప్పుటకు ధైర్యం చేస్తాడో, ఆ మనిషిని సంకోచించకుండా దైవదూషకుడని పిలుస్తాడు మరియు అతనిలో ఒక గొప్ప పాపిని చూస్తాడు.
అయితే అదే మంచి క్రైస్తవుడు, నేటి కాలపు ప్రకటనలను, అవి అదే విధంగా, దానికొరకు ఆశీర్వదించబడిన వారి ద్వారా ఇవ్వబడిననూ, అత్యుత్సాహంతోకూడిన కోపంలో తృణీకరిస్తాడు మరియు వాటిని అందించేవారిని తడుముకోకుండా దైవదూషకులని కూడా పిలుస్తాడు, అత్యంత అనుకూలమైన సందర్భాలలో బహుశా కేవలం స్వాప్నికులని లేక వ్యాధిగ్రస్తులని, చాలాసార్లు తప్పుదారి పట్టించబడినవారని పిలుస్తాడు.
మీరే స్వయంగా ఆలోచించండి, అక్కడ ఆరోగ్యమైన ఆలోచన ఎక్కడ ఉన్నది, ఎక్కడ కఠినంగా నిగమనం చేయుట ఉన్నది మరియు ఎక్కడ న్యాయం ఉన్నది? ఖండితమైన విశ్వాసులమని తమను ఇష్టంగా పిలుచుకొనేవారి ఈ అభిప్రాయాలు, ఏకపక్షమైనవి మరియు అసాధారణంగా పరిమితమైనవై యున్నవి. అయితే, అత్యధిక సందర్భాలలో అది వారి అత్మ యొక్క సోమరితనమైయున్నది మరియు దానిలోనుండి ఎల్లప్పుడు ఉత్పన్నమయ్యే, ఆత్మీయంగా బలహీనులైన వారి మనుష్య అహంకారమైయున్నది. ఆ బలహీనులు, కనీసం బయటకు కనబడుటకైనా, ఒకానొకసారి నేర్చుకొన్న, అయితే ఎప్పుడూ తమలో నిజంగా అనుభవించని పూర్వ సంఘటనలోని ఒక విషయాన్ని ఇంకా బలవంతంగా పట్టుకొని వ్రేలాడుటకు శ్రమపడుతుంటారు. వారి ఆత్మ యొక్క అభివృద్ధికి వారు ఏమాత్రమూ సమర్థులైయుండరు మరియు అందువల్ల వారు క్రొత్త ప్రకటనలనన్నింటినీ తృణీకరిస్తారు.
విశ్వాసులలో ఎవరు ఇంతవరకు, ఆనాటి శుద్ధరాత్రిలో దైవకుమారుని జన్మ ద్వారా నిశ్శబ్దంగా సంభవించిన ఆ సంఘటనలోవున్న దేవుని గొప్పతనాన్ని కనీసం ఊహించుకో గలిగారు. దానితో భూమికి, ఒక బహుమానంగా అనుగ్రహించబడిన కృపను ఎవరు ఊహించుకో గలిగారు!
ఆనాడు మండలాలలో జయోత్సాహము ఉండింది, నేడయితే దుఃఖమున్నది. కేవలం భూమిపై మాత్రమే కొందరు మనుష్యులు తమకు లేక ఇతరులకు సంతోషాన్ని కలుగజేయుటకు ప్రయత్నిస్తారు. అయితే ఇదియంతయూ, దేవుని గుర్తింపు లేక అసలు దేవుని గురించిన భావము మనుష్యాత్మలో చేతనమైనప్పుడు అది ఉండవలసిన భావంలో లేదు.
వాస్తవాన్ని వారు అత్యంత స్వల్పంగా తెలుసుకొన్నట్లయితే, మనుష్యులందరి విషయంలో అది గొర్రెలకాపరులకు జరిగినట్లు జరిగియుండేది. నిజానికి ఆ గొప్పతనం కారణంగా అది అసలేమాత్రమూ వేరుగా ఉండగలిగేది కాదు. వారు తక్షణమే మోకాళ్ళపై పడియుండేవారు … భయంలో! కాగా దానిగురించి చూచాయగా తెలుసుకొనుట ద్వారా తప్పక మొదటగా భయము శక్తివంతంగా ఉత్పన్నమవుతుంది మరియు మనిషిని మోకరిల్లుటకు నిర్బంధిస్తుంది, ఎందుకంటే, దేవుని గురించి చూచాయగా తెలుసుకొనుటతో, మనిషి భూమిపై, కేవలం అతని నిర్లక్ష్యపూర్వకమైన స్వభావంలో దేవుని ఆశీర్వాదాలను తీసుకొనుట ద్వారా మరియు దేవుని సేవలో దానికి ప్రతిగా నిజంగా దేనినీ చేయకుండుట ద్వారా, తనపై మోపుకొన్న గొప్ప అపరాధం సహితం తనను కనబరచుకొంటుంది!
క్రిస్మస్ పండుగను, అరుదుగా ఎప్పుడైనా ఒకసారి తనలో నిజంగా అనుభవించగోరే ప్రతిమనిషి, తన బాల్యాన్ని గుర్తుచేసుకొనుటకు ప్రయత్నించుట ఎంత విచిత్రమైనదో!
వయోజనునిగా అతడు క్రిస్మస్ పండుగను అంతఃకరణానుభూతితో అనుభవించుటకు పూర్తిగా అసమర్థుడనే విషయానికి అది ఒక స్పష్టమైన సూచనగా పరిగణించబడవలెను కదా! అతడు చిన్నబిడ్డగా కలిగియుండిన దానిని దేనినో కోల్పోయాడనుటకు అది రుజువైయున్నది! అది మనుష్యులను ఎందుకు ఆలోచింపజేయదో!
అది మరల ఆత్మీయ సోమరితనమే, అది వారిని, ఈ విషయాలలో గంభీరంగా నిమగ్నమగుటనుండి అడ్డుకుంటుంది. “అది పిల్లలకొరకు” అనియూ, వయోజనులు దానికొరకు ఎటువంటి సమయాన్ని కలిగియుండరు! వారు తప్పక మరింత గంభీరమైన విషయాలను గురించి ఆలోచించవలసి యుంటుంది అనియూ వారనుకొంటారు.
మరింత గంభీరమైన విషయాలు! వారి అభిప్రాయంలో గంభీరమైన విషయాలు అంటే కేవలం ఐహికమైన వాటిని వెంటాడుట, అనగా మేధస్సు యొక్క కలాపం అని అర్థం! ఎప్పుడో ఒకసారి అంతఃకరణానుభూతికి చోటివ్వబడినట్లైతే, అప్పుడు మేధస్సు, తన ప్రాధాన్యతను కోల్పోకుండా ఉండుటకు, జ్ఞాపకాలను త్వరగా చాలా వెనుకకు నెట్టివేస్తుంది.
పైకి చాలా చిన్నవిగా కనబడే ఈ వాస్తవాలన్నింటిలో అత్యంత గొప్ప విషయాలు గుర్తించబడవచ్చు, ఒకవేళ మేధస్సు కేవలం సమయాన్ని దానికొరకు కేటాయించినట్లైతే. కాని అది పైచేయిని కలిగియున్నది మరియు దానిని నిలుపుకొనుటకు సమస్తమైన జిత్తులతో మరియు కపటంతో పోరాడుతుంది. అనగా, నిజానికి మేధస్సు కాదు, కాని మేధస్సును ఏది సాధనంగా వాడుతున్నదో మరియు దాని వెనుక పొంచియున్నదో అది పోరాడుతుంది: చీకటి!
చీకటి, జ్ఞాపకాలలో వెలుగును కనుగొనబడనివ్వగోరదు. మరియు ఆత్మ, వెలుగును కనుగొనుటకు, క్రొత్త శక్తిని దానిలోనుండి తోడుకొనుటకు ఏ విధంగా కాంక్షిస్తుందో మీరు దేని ద్వారా గుర్తిస్తారంటే, బాల్యంలో అనుభవించిన శుద్ధరాత్రి యొక్క జ్ఞాపకాలతోపాటు ఒక అనిర్దిష్టమైన, దాదాపు బాధతోకూడిన కాంక్ష ఉత్పన్నమవుతుంది. అది చాలామంది మనుష్యులను తాత్కాలికంగా మెత్తటి స్వాభావికులనుగా చేయుటకు సామర్థ్యాన్ని కలిగియుంటుంది.
మెత్తటి స్వభావాన్ని కలిగించే ఈ ప్రక్రియ, ఒకవేళ సత్వరమే మరియు పూర్ణశక్తితో కూడా ఉపయోగించబడినట్లైతే, అది జాగృతికి అత్యుత్తమమైన పునాది కాగలదు! అయితే దురదృష్టవశాత్తు వయోజనులు ఆ సంధర్భంలో కేవలం పగటికలలను కనుటలో మాత్రమే నిమగ్నమైయుంటారు, తద్వారా ఆ ఉద్భవించే శక్తి వ్యర్థం చేయబడుతుంది, వృధా అవుతుంది. మరియు పగటికలలు కనుటలో ఆ అవకాశం కూడా ఎటువంటి మేలును కలుగజేయకుండా లేక ఉపయోగించబడకుండా చేజారిపోతుంది.
ఒకవేళ అప్పుడు కొందరు మనుష్యులు కొన్ని కన్నీళ్లు కార్చినా, వారు వాటికొరకు సిగ్గుపడతారు, వాటిని దాచుకొనుటకు ప్రయత్నిస్తారు, ఒక శరీరపు కుదుపుతో తమను తాము సముదాయించు కొంటారు. దానిలో అతితరచుగా ఒక అనాలోచితమైన ధిక్కారము స్పష్టమవుతుంది.
దీనియంతటిలోనుండి మనుష్యులు ఎంత నేర్చుకోగలరో. ఏ కారణం లేకుండానే బాల్యపు జ్ఞాపకాలతో ఒక సున్నితమైన బాధ అల్లుకొనదు. అది, ఏదో పోయింది, పోతూ ఒక శూన్యాన్ని వదిలింది అనే స్పృహకు తెలియని అనుభూతియై యుంటుంది, ఇంకా పిల్లలవలే అంతఃకరణానుభూతిని పొందుటకు అసమర్థత.
అయితే మీరు తరచుగా, ఎవరి కళ్లలోనుండి అప్పుడప్పుడు ఒక పిల్లలవంటి ప్రకాశం వెలువడుతుందో, అటువంటి ప్రతిమనిషి, ఎంత అద్భుతంగా మరియు ఉత్తేజకరంగా, కేవలం అతని సముఖం ద్వారా మౌనంగా ప్రభావం చూపుతాడో, తప్పక గమనించి యుంటారు.
పిల్లలవంటి గుణము పిల్లతనం కాదని వయోజనుడు మరువరాదు. కాని ఎందువల్ల పిల్లలవంటి గుణము ఆ విధంగా పనిచేయగలదో, అది అసలు ఏమైయున్నదో మరియు ఎందువల్ల యేసు “పిల్లలవలే కండి!” అన్నాడో, మీకు తెలియదు!
పిల్లలవంటి నైజం ఏమిటో లోతుగా తెలుసుకొనుటకు మీకు మొదట తప్పక, పిల్లలవంటి నైజము బాల్యంతో ఏమాత్రమూ ముడిపడి యుండదని స్పష్టమైయుండాలి. నిజంగా సుందరమైన పిల్లలవంటి నైజం లోటైయున్న పిల్లలను మీరు తప్పక ఎరిగియుంటారు! అనగా పిల్లలవంటి నైజము లేని పిల్లలు ఉంటారు! ఒక చెడ్డపిల్లవాడు ఎప్పటికీ పిల్లలవంటి నైజం ద్వారా ప్రభావాన్ని చూపలేడు, అదే విధంగా ఒక సరిగా పెంచబడని, నిజానికి చెడుగా పెంచబడిన పిల్లవాడు కూడా!
దానిలోనుండి, పిల్లలవంటి నైజము మరియు పిల్లవాడు రెండు పరస్పరం స్వతంత్రమైన విషయాలని స్పష్టమవుతుంది.
ఏది భూమిపై పిల్లలవంటి నైజం అనబడుతుందో, అది స్వచ్ఛతలోని ప్రభావం యొక్క ఒక శాఖయైయున్నది! కేవలం భౌతిక-మానవ భావంలో స్వచ్ఛత కాదు, కాని దాని ఉన్నతమైన భావంలో. ఏ మనిషైతే దైవ శుద్ధత్వం యొక్క కిరణంలో జీవిస్తాడో, శుద్ధత్వం యొక్క కిరణానికి తనలో చోటునిస్తాడో, అతడు తద్వారా పిల్లలవంటి నైజాన్ని సహితం పొందియుంటాడు, అది ఇంకా బాల్యంలోనే అయినా లేక ఒక వయోజనునిగా కూడా.
పిల్లలవంటి నైజము ఆంతరంగిక స్వచ్ఛత యొక్క ఫలితమై యుంటుంది లేక అది, అటువంటి మనిషి తనను స్వచ్ఛతకు సమర్పించు కొన్నాడు, దానిని సేవించుచున్నాడు అనే విషయానికి ఒక సూచనయై యుంటుంది. అవియన్నియూ కేవలం వేర్వేరు వ్యక్తీకరణ విధాలు మాత్రమే, కాని నిజానికి ఎల్లప్పుడు ఒకటైయుంటాయి.
అనగా కేవలం తనలో స్వచ్ఛమైనదైయున్న బిడ్డ మరియు తనలో స్వచ్ఛతను పోషించే వయోజనుడు మాత్రమే, పిల్లలవంటి నైజం ద్వారా ప్రభావం చూపగలరు. అందువల్ల వారు తారుణ్యంగా మరియు ఉత్తేజపరుస్తూ ప్రభావం చూపుతారు, విశ్వాసాన్ని సహితం కలుగజేస్తారు!
మరియు ఎక్కడ నిజమైన స్వచ్ఛత ఉంటుందో, అక్కడ నిజమైన ప్రేమ కూడా ప్రవేశించగలదు, కాగా దేవునిప్రేమ స్వచ్ఛత యొక్క కిరణంలో పనిచేస్తుంది. స్వచ్ఛత యొక్క కిరణము, అది నడిచే మార్గమై యున్నది. వేరొక మార్గాన పోవుటకు దానికి సాధ్యంకాదు.
ఎవడు తనలో స్వచ్ఛత యొక్క కిరణాన్ని గ్రహించియుండడో, వాని యొద్దకు దేవుని ప్రేమ యొక్క కిరణం ఏనాటికీ మార్గాన్ని కనుగొనలేదు!
దానిని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి మరియు మీకొరకు క్రిష్టమస్ బహుమానంగా, స్వచ్ఛతకు మిమ్ములను తెరచుకొనుటకు, స్థిరమైన తీర్మానాన్ని చేసుకోండి, తద్వారా, దేవుని ప్రేమలో రోజాపువ్వు యొక్క పండుగయైన, ప్రకాశవంతమైన నక్షత్రం యొక్క పండుగ సందర్భంగా, ప్రేమ యొక్క కిరణము, స్వచ్ఛత యొక్క మార్గంపై మీ యొద్దకు చొచ్చుకొని రాగల్గుటకు!
అప్పుడు మీరు ఈ క్రిష్టమస్ పండుగను, దేవుని చిత్తప్రకారం అది ఎట్లు చేసుకోబడవలెనో ఆ విధంగా సరిగా చేసుకొనియుంటారు! దానితో మీరు, దేవుడు భూమికి శుద్ధరాత్రితో పదే పదే అనుగ్రహించే దేవుని యొక్క గ్రహింపశక్యం కాని కృపకొరకు, యథార్థమైన కృతజ్ఞతను చెల్లిస్తారు!
దైవకుమారుని జన్మకు జ్ఞాపకార్థంగా నేడు ఎన్నో దైవసేవలు ఆచరించబడతాయి. ఆత్మలో లేక మీ జ్ఞాపకాలలో అన్ని రకాల చర్చిలగుండా త్వరగా పొండి, అట్లు చేయునప్పుడు మీ అంతఃకరణానుభూతిని మాట్లాడనివ్వండి. అప్పుడు మీరు, దైవసేవలు అని పిలువబడే ఆ సమావేశాలనుండి నిశ్చయతలో వెనుదిరుగుతారు!
మొదటి క్షణంలో మనిషి, నేను ఈ విధంగా మాట్లాడుతున్నానేమిటి అని ఆశ్చర్యపోతాడు, దానితో నేనేమి చెప్పగోరుతున్నానో అతడెరుగడు. అయితే అది కేవలం ఎందుకంటే, అతడింతవరకు ఎప్పుడు కూడా, “దైవసేవ” అనే వ్యక్తీకరణను గురించి ఒకసారి ఆలోచించుటకు మరియు ఆ తరువాత, దైవసేవ అని మనిషి పిలిచే ప్రక్రియలతో దానిని పోల్చుటకు కృషిచేయలేదు. శతాబ్దాలనుండి అలవాటుగా ఉనికిలోవున్న చాలా విషయాలవలె, మీరు దానిని సులువుగా అంగీకరించారు.
మరి అయిననూ “దైవసేవ” అనే ఆ వ్యక్తీకరణ ఎంత స్పష్టమైనదంటే, తప్పైన భావంలో అది అసలేమాత్రమూ ఉపయోగించ బడలేదు, ఒకవేళ మనిషి శతాబ్దాలనుండివున్న అలవాటును నిరాసక్తిలో మరియు సంశయంలేకుండా పదే పదే అంగీకరించకుండినట్లయితే మరియు కొనసాగించ నట్లయితే. ఏది ఇప్పుడు దైవసేవ అని పిలువబడుతుందో, అది అతి శ్రేష్టమైన సందర్భంలో ఒక ప్రార్థనయు మరియు దానికి తోడైయుండే, దైవకుమారుని ద్వారా పలుకబడినవిగా పరిగణించబడే, ఆ తరువాత మాత్రమే, కేవలం మనుష్య చేతులతో వ్రాయబడిన మాటలకు, మానవ వివరణను ఇచ్చుటకు చేసే ప్రయత్నమూ అయ్యుంటుంది.
ఈ వాస్తవంలో ఏదీ కూడా మార్చబడలేదు, ఏ మనిషి కూడా అటువంటి వ్యక్తీకరణలను, అతడు తనపట్ల మరియు వాస్తవంగా జరిగినదానిపట్ల నిజాయితీగా ఉండగోరినట్లయితే, ఖండించలేడు. అన్నింటికంటే ముఖ్యంగా అతడు దానిగురించి సమగ్రంగా ఆలోచించుటకు సోమరిగా ఉండనట్లయితే మరియు ఇతరుల ద్వారా ఇవ్వబడిన వట్టిమాటలను తనను తాను క్షమించుకొనుటకు ఉపయోగించనట్లయితే.
మరియు అయిననూ సరిగ్గా “దైవసేవ” అనే వ్యక్తీకరణయే తన స్వభావంలో ఎంత సజీవమైనది మరియు తనద్వారా తానే స్వయంగా మనుష్యులతో ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, కేవలం స్వల్పమైన అంతఃకరణానుభూతిని కలిగి యున్నట్లయితే, మనిషి ఆ వ్యక్తీకరణను, ఒకప్రక్క తాను ఎంతో అభివృద్ధిచెందిన వాడినని భావిస్తూనే, నేడు కూడా దేనిని పిలుచుటకు ఇంకా వాడుతున్నాడో, దానికొరకు అది వాడబడగలిగేది కాదు.
ఒకవేళ ఆ వ్యక్తీకరణ, అది తనలో కలిగియున్న దానియంతటితోపాటు, వాస్తవికతగా ఉత్పన్నం కావలెనంటే, దైవసేవ తనను ఇప్పుడు తప్పక సజీవమైనదానిగా కనబరచుకోవలసి యుంటుంది. మనుష్యులైన మీరు, సేవ క్రింద, అనగా సేవించుట క్రింద ఏమి అర్థం చేసుకొంటారు అని నేను ప్రశ్నించినట్లయితే, “పనిచేయుట” అనే మాటతో తప్ప వేరుగా జవాబునిచ్చేవారు ఎవరూ ఉండరు. అది “సేవ” అనే మాటలోనే ఎంతో స్పష్టంగా సూచించబడుతుంది. వేరొక దానిని గురించి మనిషి అక్కడ ఏమాత్రమూ ఆలోచించలేడు.
భూమిపై దైవసేవ అంటే సహజంగా, దేవుని శాసనాల భావంలో ఇక్కడ భూమిపై పనిచేయుట, భౌతికంగా వాటిలో ప్రకంపిస్తూ కార్యంచేయుటయే తప్ప మరేమీ కాదు. దేవుని చిత్తమును భూమిపై కార్యంగా రూపాంతరం చేయుట!
మరియు అదే అంతటా లోటైయున్నది!
భౌతికకార్యంలో దేవుణ్ణి సేవించుటకు ఎవరు ప్రయత్నిస్తారు. ప్రతిఒక్కడు కూడా అక్కడ, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు మరియు కొంతవరకు భౌతికంగా తన దగ్గరివారిని గురించి. కాని అతడు, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఆయనను సేవిస్తున్నానని నమ్ముతాడు!
కేవలం ఒక్కసారి మీరే ఆలోచించండి, దేనిలో నిజానికి అక్కడ దైవసేవ ఉంటుందో? నిజానికి అది సేవించుట కాదు కాని ఏదో వేరొకటైయున్నది! దైవసేవ అని నేడు పిలువబడే దానిలో, ప్రార్థన ఇమిడియుండే భాగము, ఆ విధంగా ఉంటుంది. వేరొక భాగము, అనగా మనుష్యుని చేతితో వ్రాయబడ్డ ఆ వాక్యం యొక్క వివరణ, ఎవరైతే అక్కడ దానిని అర్థంచేసుకొనుటకు నిజంగా కృషిచేస్తున్నారో, వారి విషయంలో, తిరిగి కేవలం నేర్చుకొనుటగా పరిగణింపబడవచ్చు. అనాసక్తిగలవారు మరియు పైపైతత్వం గలవారు ఇక్కడ ఎలాగూ అసలు పరిగణనలోకిరారు.
దైవసేవను “దర్శించుట” లేక దానిని “ప్రత్యక్షంగా అనుభవించుట” అని మనుష్యులు అనుట ఏమాత్రమూ తప్పుకాదు. అవి సరియైన వ్యక్తీకరణలైయున్నవి. అవి, వాటికవే తమ గురించి చెప్పుకొంటున్నవి!
అయితే మనిషి దైవసేవను స్వయంగా చేయవలసియుంటుంది, దానికి దూరంగా నిలిచియుండుట కాదు. “అర్థించుట” సేవించుట కాదు, కాగా అర్థించునప్పుడు మనిషి సాధారణంగా దేనినైనా దేవునినుండి పోందగోరతాడు, అక్కడ దేవుడు అతనికి దేనినైనా చేయవలెను. అది నిజానికి “సేవించుట” యొక్క భావం నుండి ఎంతో దూరంలో ఉన్నది. అనగా అర్థించుటకు మరియు ప్రార్థనకు దైవసేవతో ఎటువంటి సంబంధం ఉండదు.
అది బహుశా ప్రతి మనిషికి చాలా సులువుగా అర్థం కాగలదు. మనిషి భూమిపై చేసే దానియంటి వెనుక తప్పక ఒక అర్థం ఉండవలసి యుంటుంది కదా. అతడు, అతనికి ప్రసాదించబడిన భాషను, అతనికి ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేయలేడు, తనకు నష్టం కలుగజేసుకోకుండా. మనుష్యుని మాటలో సహితం ఉన్నట్టి శక్తిని గురించి అతడు ఎటువంటి జ్ఞానాన్ని పొందకుండినట్లయితే, అది అతణ్ణి దానినుండి కాపాడలేదు.
అతడు దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే, అది అతని తప్పే! మరియు అతడప్పుడు, మాటలను తప్పుగా ఉపయోగించుట యొక్క పరిణామాలకు గురియవుతాడు. అది అతనికి, ప్రోత్సాహకంగా అగుటకు బదులు అడ్డంకిగా అవుతుంది. సృష్టిశాసనాలన్నింటి యొక్క స్వయంచాలకమైన నేత, మనుష్యుల యొక్క నిర్లక్ష్యాల కారణంగా ఆగదు లేక సంశయించదు, కాని సృష్టిలో ప్రవేశపెట్టబడిన దంతయూ తన గమనాన్ని, అత్యంత దృఢమైన ఖచ్చితత్వంలో కొనసాగిస్తుంది.
మనుష్యులు ఎప్పుడూ ఆలోచించని విషయం అదే మరియు వారు అందువల్ల దానిని గమనించక నష్టపోతారు. స్వయంగా అత్యంత చిన్న విషయాలలో, అత్యంత అల్పమైన విషయాలలో అది ఎల్లప్పుడు తదనుగుణంగా పనిచేస్తుంది.
సమావేశాలకు “దైవసేవ” అనే పేరుతో ఇవ్వబడిన, స్వభావసిద్ధంగా తప్పైయున్న ఆ హోదాయే, మనుష్యుల ద్వారా నిజమైన దైవసేవ నెరవేర్చబడకుండా ఉండుటకు ఎంతో దోహదపడింది. ఎందుకంటే ప్రతియొక్కడు, అటువంటి ఒక దైవసేవను ప్రత్యక్ష్యంగా అనుభవించుట ద్వారా తగినంత చేసియున్నట్లు నమ్మాడు. అది ఎప్పుడూ సరియైన దైవసేవయై ఉండలేదు. –
ఆ సమావేశాలను ఉమ్మడి దైవారాధన గంటలు అని పిలవండి, అది కనీసం దాని భావానికి చేరువగా వస్తుంది మరియు దానికొరకు ప్రత్యేక సమయాలను కేటాయించుట కూడా కొంత స్థాయి వరకు దానిని సమర్థిస్తుంది, నిజానికి దైవారధన ప్రతి చూపులోను, సమస్త ఆలోచనలోను మరియు కార్యంలోను ఉండగల్గినా మరియు వ్యక్తీకరించబడగల్గినా.
చాలామంది ఇప్పుడు అనుకొంటారు, కృత్రిమమైన దానిగా, ఉద్దేశపూర్వకమైన దానిగా కనబడకుండా, అది అసలేమాత్రమూ సాధ్యంకాదని. కాని అది అట్లు ఉండదు. ఎంత ఎక్కువగా నిజమైన దైవారాధన ఉప్పొంగుతుందో, అంతే సహజంగా మనిషి, అతడు చేసే దానియంతటిలో అవుతాడు, ఏకంగా అతని అత్యంత సాధారణమైన కదలికలలో సహితం. అప్పుడతడు, తన సృష్టికర్తపట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతలో ప్రకంపిస్తాడు మరియు ఆశీర్వాదాలను అత్యంత స్వచ్ఛమైన రూపంలో అనుభవిస్తాడు.
నేడు, శుద్ధరాత్రి పండుగ సందర్భంగా ఏదోఒక భూలోక దైవసేవను తిరిగి గుర్తుకు తెచ్చుకోండి.
సంతోషభరితమైన కృతజ్ఞత, ఆనందోత్సాహాలు అక్కడ, ఒకనాడు దేవుడు మనుష్యులకు దానితో అనుగ్రహించిన కృపకొరకు, ప్రతి మాటలో ప్రకంపించవలెను. మనుష్యుల మధ్య ఆ కృప అసలు విలువకట్టబడగల్గునంతవరకు, కాగా దాని యొక్క వాస్తవమైన గొప్పతనాన్ని సంపూర్ణంగా గ్రహించుటకు మనుష్యాత్మకు సాధ్యం కాదు.
కాని దానికొరకు అంతటా వెదకినా, అది వృధా ప్రయాసయై యుంటుంది. వెలుగు ఉన్నతముల దిశగా సంతోషభరితమైన ఊర్ధ్వారోహణ లోటైయుంటుంది! కృతజ్ఞతోత్సాహం యొక్క జాడనే ఉండదు. పైగా అక్కడ తరచుగా కొంత మానసికఒత్తిడి సహితం గమనించబడగలదు. దాని మూలము మనిషి వివరించలేని ఆశాభంగంలో ఉంటుంది.
కేవలం ఒక్క విషయం మాత్రమే అంతటా కనుగొనబడగలదు, అది అన్ని మతవర్గాల దైవసేవల స్వభావమును, అత్యంత పదునైన ఉలితో చెక్కబడినట్లు చూపుతుంది, సూచిస్తుంది లేక అది, దైవసేవలో ప్రకంపించే దానినంతటినీ, అది వినబడునట్లు సాక్షాత్కరించుటకు బలవంత పరుస్తుంది: ప్రసంగించే స్వరాలన్నింటి ద్వారా ఒక బాధాకరమైన ధ్వని, విసుగుపుట్టించే విధంగా వినబడుతుంది. అది నిరంతరం పునరావృతం చేయబడుటవల్ల అలసటను కలుగజేస్తుంది మరియు నిద్రలోనికి జారిపోయే జీవాత్మలపై ఒక బూడిదరంగు తెరవలే తనను కప్పుకుంటుంది.
అయిననూ అది అక్కడ కొన్నిసార్లు, ఏదో కోల్పోయిన దానికొరకు లేక కనుగొనబడని దానికొరకు, మరుగైయున్న ప్రలాపంవలె వినబడుతుంది! మీరే స్వయంగా పోయి వినండి. అంతటా మీరు ఈ విచిత్రమైన, స్పష్టంగా కనబడే దానిని కనుగొంటారు!
మనుష్యులు దానిగురించి స్పృహను కలిగియుండరు, కాని వాడుక భాషలో చెప్పాలంటే, అది కేవలం ఆ విధంగా సంభవిస్తుంది!
మరియు దానిలో సత్యం ఉంటుంది. వక్త ద్వారా ఆశించబడకుండానే అది సంభవిస్తుంది మరియు అదంతా ఏ రకంగా ప్రకంపిస్తుందో ఎంతో స్పష్టంగా చూపుతుంది. సంతోష భరితంగా ఊర్ధ్వానికి ఎగయుట అక్కడ అసలు ఉండదు, ఊర్ధ్వానికి ఎగిసే మంటలు కూడా అక్కడ ఉండవు, కాని అది ఒక మబ్బైన, నిస్తేజమైన లోలోన కాలుటయై యుంటుంది. స్వతంత్రంగా పైకి చొచ్చుకొనిపోవుటకు అది శక్తిని పుట్టించలేదు.
ఎక్కడైతే వక్త, ఆ దైవసేవల మబ్బైన, నిస్తేజమైన ప్రకంపన ద్వారా తనను “మోయ” బడనివ్వడో, దాని ద్వారా ప్రభావితం చేయబడకుండా ఉంటాడో, ఏదైతే ఒక నిర్దిష్టమైన నులివెచ్చదనంతో లేక ఉద్దేశపూర్వకంగా దూరంగా నిలుచుటతో సమానమైయుంటుందో, అక్కడ అన్ని మాటలు జిడ్డుతోకూడినవై యున్నట్లు కనబడతాయి. అది, ఉదాసీనమైన, వెచ్చదనం లేని, నిర్ధారణ లేని మ్రోగే కంచువలే ఉంటుంది.
రెండు సందర్భాలలోనూ నిర్ధారణ యొక్క ఉత్సుకత లోటైయుంటుంది, సంతోషభరితమైన ఉద్వేగంలో తోటిమనుష్యులందరికి దానిగురించి చెప్పగోరుటకు విజయవంతమైన జ్ఞానం యొక్క శక్తి లోటైయుంటుంది.
“దైవసేవ” అనే వ్యక్తీకరణ విషయంలో ఉన్నట్లు, ఒక వ్యక్తీకరణ చెప్పేదానికి వేరుగా దానిలోని విషయం ఉన్నట్లయితే, తద్వారా తప్పుదారిపట్టించే పేరు ఉపయోగించబడి నట్లయితే, అప్పుడు ఈ తప్పు జరుగుతుంది. అక్కడ ఉండగలిగే శక్తి, ప్రారంభంనుండే తప్పైన పేరు ఉపయోగించబడుట ద్వారా విరుగగొట్ట బడుతుంది. నిజమైన, ఏకరీతిగావుండే ప్రకంపన సజీవంకాలేదు, ఎందుకంటే పేరును ఇచ్చే ఆ వ్యక్తీకరణ ద్వారా వేరొక భావము ఉత్పన్నమై యుంటుంది కాబట్టి. మరియు అది అప్పుడు నెరవేరదు. దైవసేవను నిర్వహించుట అక్కడ, ప్రతి మనుష్యాత్మ యొక్క అత్యంత లోతైన అంతఃకరణానుభూతిలో “దైవసేవ” అనే వ్యక్తీకరణ ఉత్పన్నం చేసే చిత్రానికి వ్యతిరేకంగా ఉంటుంది.
బయటకు పొండి మరియు నేర్చుకోండి, అప్పుడు మీరు త్వరలోనే, ఎక్కడ మీకు నిజమైన జీవపురొట్టె అందించబడుతుందో గుర్తిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉమ్మడి సమావేశాలను పావనమైన దైవారాధన గంటలుగా ఉపయోగించండి. అయితే, దైవసేవను మీరు, మీ ఉనికి యొక్క సమస్త కార్యంలో, స్వయంగా జీవితంలో కనబరచండి. కాగా దానితో మీరు మీ సృష్టికర్తను, ఉనికిలో ఉండుటకు అనుమతించిన కృపకొరకు, కృతజ్ఞతలో, ఆనందంలో, సేవించవలెను!
మీరు ఆలోచించే మరియు చేసే దానినంతటినీ దైవసేవగా చేయండి! అప్పుడు అది మీకు, ఏ శాంతిని మీరు కాంక్షిస్తున్నారో, దానిని తెస్తుంది. మరియు మనుష్యులు మిమ్ములను తీవ్రంగా వేధించినా, అది అసూయలోనైనా, దుష్టత్వంలో నైనా లేక నీచమైన అలవాట్లద్వారా నైనా, మీరు మీలో ఎల్లప్పుడు శాంతిని కలిగియుంటారు మరియు అది మీకు చివరకు, సమస్త భారమైన దానిని కూడా అధిగమింపజేస్తుంది!
| ISBN | 978-3-87860-671-0 |
|---|---|
| Auteur | అబ్ద్-రు-షిన్ |
| Uitvoering | .epub, .azw3 (కాపీ రక్షణ లేకుండా / DRM) |
| Taal | తెలుగు |
| Levertijd | చెల్లింపు తర్వాత అందుబాటులో ఉంది |